వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యుత్ ఘాతంతో యువకుడి మృతి
కౌశిక్ శర్మ Jun 23, 2026 6:47 AM అనంతపురం 2 viewsabout 2 hours ago

బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో సోమవారం విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, విద్యుత్ తీగలు కర్రలకు తగిలి స్తంభం ట్రాక్టర్‌పై విరిగిపడింది. ఈ దుర్ఘటనలో విద్యుత్ షాక్‌కు గురై ఆవుల సాయికుమార్ (25) అక్కడికక్కడే మరణించాడు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...