Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 2 లక్షల పలికిన అరుదైన చేప!

రూపేష్ గౌడ్ Jun 23, 2026 7:10 AM కోనసీమ 7 viewsabout 2 hours ago
రూ. 2 లక్షల పలికిన అరుదైన చేప! - Udayam Digital
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారుల వలకి 25 కిలోల బరువున్న అరుదైన మగ చేప చిక్కింది. అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ అరుదైన రకం చేపను వైద్య ఔషధాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో నిర్వహించిన బహిరంగ వేలంలో పాలకొల్లుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి ఏకంగా రెండు లక్షల రూపాయల భారీ ధర వెచ్చించి ఈ చేపను సొంతం చేసుకున్నారు.

Comments

G
Loading comments...