వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూర్ మండలంలో యాసంగి పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. బోరుబావుల వద్ద వరి నారుమడులు సిద్ధం చేస్తూ నారుపోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలం పంట కోతలు పూర్తి చేసుకుంటున్న రైతులు తదుపరి సాగుపై దృష్టి సారించారు.
నీటి లభ్యతను బట్టి వరి సాగు చేపట్టేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి.
Comments
Loading comments...

