వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ ఏపీ తీరంలో తీరం దాటే ప్రక్రియను ప్రారంభించింది. మరో గంటన్నరలో యానాం సమీపంలో పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాన్ గంటకు 3 కి.మీ వేగంతో కదులుతోంది.
కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరిలో 125-135 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

