వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళా రైతు సాధికారత బిల్లు పాస్.

మహారాష్ట్ర అసెంబ్లీ 'మహిళా రైతు సాధికారత బిల్లు-2026'ను ఏకగ్రీవంగా ఆమోదించింది. భూమి తమ పేరిట లేకపోయినా వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమల్లో ఉన్న మహిళలకు దీని ద్వారా రైతు ధృవీకరణ పత్రం లభిస్తుంది.
ఈ చారిత్రాత్మక బిల్లుతో పురుష రైతులతో సమానంగా మహిళలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయి. రాష్ట్రంలో కేవలం 15 శాతం మహిళల పేర్లపైనే భూ రికార్డులు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...