వార్తలకు తిరిగి వెళ్లండి
లక్నోలో రూ.200 కోట్ల సైబర్ మోసం రట్టు.

లక్నోలోని సమ్మిట్ బిల్డింగ్ కేంద్రంగా సాగుతున్న రూ.200 కోట్ల అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి 40 మంది మహిళలతో సహా మొత్తం 119 మందిని అరెస్ట్ చేశారు.
కాల్ సెంటర్ రూపంలో నడుస్తున్న ఈ ముఠా.. అమెరికా వంటి విదేశీ పౌరులను టార్గెట్ చేస్తూ అమెజాన్, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులుగా, ఎఫ్‌బీఐ అధికారులగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టెక్నికల్ పరికరాలు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...