Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంతో మహిళ మృతి

Follow Udayam on Google
రవళి దేవి Jul 30, 2026 12:47 PM సిద్దిపేటGeneral
విద్యుదాఘాతంతో మహిళ మృతి - Udayam
సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం అనాజీపూర్‌లో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ గాయపడింది. వరినాట్లకు వెళ్లిన రాచకొండ లక్ష్మి(55), పోచవ్వ ఫెన్సింగ్‌ వైరు తాకడంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా లక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన పోచవ్వకు చికిత్స కొనసాగుతోంది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...