వార్తలకు తిరిగి వెళ్లండి
హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆస్పత్రిలో చికిత్స వికటించి మంజుల అనే మహిళ మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన ఆమెకు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇవ్వగానే ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

