వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామ సమీపంలో సోమవారం ఓ కారు అదుపుతప్పి వంశధార ఎడమ కాలువలోకి దూసుకెళ్లి నీట మునిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా, కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

