వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో ఎల్‌నినో ప్రభావంపై కళాజాత ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ప్రతిభాసింగ్ ఆదేశాలతో గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.
వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని సూచించారు. పెరుగుతున్న ఎండల పట్ల జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

