వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేనిపాలెం సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నాగులవంచలో పత్తి తీసి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పింది. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

