వార్తలకు తిరిగి వెళ్లండి

భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆసియన్ గేమ్స్ ట్రయల్స్‌లో ఆమె పాల్గొనేందుకు ధర్మాసనం అనుమతించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన అనుకూల ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, డబ్ల్యూఎఫ్ఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఈ నిర్ణయంతో శనివారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కాబోయే ట్రయల్స్‌లో వినేష్ పాల్గొనడానికి మార్గం సుగమమైంది. గతంలో ఆమె దేశం గర్వపడేలా చేశారని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.
Comments
Loading comments...

