వార్తలకు తిరిగి వెళ్లండి

అందరినీ సంతోషపెట్టడం తన పని కాదని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో ఐదో టీ20కు ముందు జట్టు ఎంపిక, ప్రదర్శనపై వస్తున్న విమర్శలకు స్పందించాడు. ప్రజాదరణ కంటే జట్టుకు ఉపయోగపడే నిర్ణయాలే ముఖ్యమన్నాడు.
సామాజిక మాధ్యమాల ఒత్తిడికి లొంగబోనని, ఆటగాళ్లకు భరోసా కల్పిస్తానని తెలిపాడు. నిలకడగా రాణించేవారికే జట్టులో దీర్ఘకాలం కొనసాగే అర్హత ఉంటుందని పేర్కొన్నాడు.
Comments
Loading comments...

