వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టాపూర్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని మండల రజక సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి లింగంపల్లి జలంధర్ అన్నారు. ఐలమ్మ స్ఫూర్తిని నేటి తరానికి అందించాలని, ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

