Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వీడియో చూస్తేనే డ్రైవింగ్ లైసెన్సు

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:21 AM హైదరాబాద్General
వీడియో చూస్తేనే డ్రైవింగ్ లైసెన్సు - Udayam
డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే రోడ్డు భద్రతపై రెండున్నర గంటల వీడియో తప్పనిసరిగా చూడాలని రవాణా శాఖ కొత్త నిబంధన అమలు చేసింది. లెర్నింగ్ లైసెన్సు పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వీడియో లింక్ పంపిస్తారు. ముఖ గుర్తింపు ద్వారా వీక్షణను పర్యవేక్షిస్తారు. మధ్యలో వీడియో ఆపితే అనర్హులవుతారు. పూర్తిగా చూసిన తర్వాత ధ్రువపత్రం అందుతుంది. దాని ఆధారంగా శాశ్వత లైసెన్సు పరీక్షకు స్లాట్ బుక్ చేసుకోవాలి.

Comments

G
Loading comments...