వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యంపై కలెక్టర్ డీకే బాలాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఐదు 11 కేవీ ఫీడర్లు నిలిచిపోవడంతో 15 వేల మంది వినియోగదారులకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని, 15 ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

