Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచేడ్‌లో ఘనంగా ఇష్టలింగ పూజ, లింగధారణ మహోత్సవం

Follow Udayam on Google
D GANESH Sep 10, 2026 1:23 AM మహబూబ్‌నగర్General
గండీడ్ మండల పరిధిలోని వెన్నచేడ్ గ్రామంలో గండీడ్ మండల వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఇష్టలింగ పూజా కార్యక్రమం, లింగధారణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గవి సిద్ది లింగేశ్వర స్వామి లింగధారణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు లింగధారణ చేయించారు. ఆచార విధివిధానాలను వివరించారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...