వార్తలకు తిరిగి వెళ్లండి

వైరా మండలంలో వైన్ షాపుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టు షాపులకు అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలలు, ఆలయాల సమీపంలో బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని సర్పంచులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
‘ప్రజావాణి’లో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. మద్యం సిండికేట్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

