Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

97 సెకెన్లలో 97 రన్స్ చేసిన వైభవ్.. IPL స్పెషల్ వీడియో షేర్

Follow Udayam Digital on Google
Vikas Singh May 28, 2026 12:35 PM ఆల్ ఇండియాక్రీడలు
97 సెకెన్లలో 97 రన్స్ చేసిన వైభవ్.. IPL స్పెషల్ వీడియో షేర్ - Udayam Digital
నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన, విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పాడు. ఈ ఇన్నింగ్స్‌కు ప్రత్యేక వీడియోను ఐపీఎల్ విడుదల చేస్తూ “97 seconds of 97” అనే హైలైట్స్‌తో షేర్ చేసింది. సెంచరీకి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, నెమ్మదిగా ఆడకుండా జట్టు కోసం భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌పై అభిమానులు ఫిదా అయ్యారు.

Comments

G
Loading comments...