వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేతో రెండో వన్డేలో భారత మహిళల జట్టు 121 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత భారత్ 50 ఓవర్లలో 328/6 పరుగులు చేయగా, జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ (126), దీప్తి శర్మ (106*) సెంచరీలతో రాణించారు. ప్రతీక రావల్ 61 పరుగులు చేసింది. బౌలింగ్‌లో వైష్ణవి శర్మ 4, దీప్తి 3 వికెట్లు పడగొట్టారు.
Comments
Loading comments...

