వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్‌లో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్, ప్రపంచ నంబర్ 1 ప్లేయర్ అరీనా సబలెంకా జోడీగా బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు 16 జోడీల జాబితాను నిర్వాహకులు ప్రకటించారు.
ఆగస్టు 25, 26 తేదీల్లో జరిగే ఈ టోర్నీలో విజేత జోడీకి 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ దక్కనుంది. జకోవిచ్ అనుభవం, సబలెంకా పవర్ హిట్టింగ్ ఈ జోడీని టైటిల్ ఫేవరెట్‌గా నిలిపాయి.
Comments
Loading comments...
