Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌ భయంతో అన్నదాతల్లో ఆందోళన

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 2:21 PM రాజన్న సిరిసిల్లGeneral
తుఫాన్‌ భయంతో అన్నదాతల్లో ఆందోళన - Udayam
వేములవాడ ప్రాంతంలో ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో గురువారం ఉదయం చిరుజల్లులు ప్రారంభం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట దెబ్బతింటుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిస్తే ధాన్యం నేలరాలడంతో పాటు పంట నష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు వర్షాలు తగ్గాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.

Comments

G
Loading comments...