వార్తలకు తిరిగి వెళ్లండి

తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
వాహన సేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. చెక్కభజనలు, కోలాటాలు, పిళ్లనగ్రోవులతో కళాబృందాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి రూరల్ మండలంలోని పలు పంచాయతీల భక్తులు సారె సమర్పించారు. బుధవారం రాత్రి హంస వాహన సేవ నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

