వార్తలకు తిరిగి వెళ్లండి
టీఆర్ఎస్ పార్టీ పేరుపై కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట..

Photo Gallery
టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ పేరు కేటాయించడం కుదరదంటూ ఎన్నికల సంఘం (ECI) జారీ చేసిన నోటీసులపై వారం రోజుల్లోగా స్పందించేందుకు న్యాయస్థానం ఆమెకు అవకాశం కల్పించింది.
ఇప్పటికే ఈ పేరుతో పోలిక ఉన్న పార్టీలు నమోదై ఉన్నాయని, వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని ఈసీ కోర్టుకు తెలిపింది. అయితే, కవిత అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే వ్యక్తిగత వాదనలు విని తుది నిర్ణయం ప్రకటించాలని ఈసీకి హైకోర్టు సూచించింది.
Comments
Loading comments...