Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాపికొండల్లో పెరిగిపోతున్న పాపం... బోటింగ్ వచ్చే యాత్రికుల నిలువు దోపిడీ

Follow Udayam on Google
sai Krishna Patel Jul 07, 2026 2:30 PM తూర్పుగోదావరి బ్రేకింగ్ న్యూస్
పాపికొండల్లో పెరిగిపోతున్న పాపం... బోటింగ్ వచ్చే యాత్రికుల నిలువు దోపిడీ - Udayam
ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమైన పాపికొండలలో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రకృతి ప్రేమికులకు యాత్రికులకు ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడి జేబులకు చిల్లులు పడుతున్నాయి. దళారీ వ్యవస్థ ప్రైవేట్ వ్యక్తులు వారికి ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు వసూలు చేస్తున్నారు కనీస నాణ్యతలేని ఆహారం మరియు బోటింగ్ ప్రయాణికులకు కనీస సేఫ్టీ ఫీచర్లు లేని బోట్లు నడపడమే కాకుండా ఇక్కడ ఫోన్ సిగ్నల్ రాదు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మేము చెప్పినంత డబ్బులు చెల్లించాల్సిందేనని టిక్కెట్లు ఇచ్చే ప్రైవేట్ వ్యక్తులు హెచ్చరించడం గమనార్హం. వెంటనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వలు స్పందించి ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విహారయాత్రలకు మంచి సదుపాయాలు కల్పించి పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నారు.

Comments

G
Loading comments...