వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్‌లో అగ్ర హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్‌ల నూతన చిత్రాల కాంబినేషన్లపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానాతో మహేశ్‌బాబు తదుపరి చిత్రం ఉండే అవకాశం ఉందనే వార్తలు ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి.
మరోవైపు బాలీవుడ్ దర్శకుడు ఆదిత్యధర్‌తో ప్రభాస్ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు భారీ క్రేజీ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి
Comments
Loading comments...

