Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్పిరిట్’ షూటింగ్‌లో జోరు పెంచిన ప్రభాస్..

Follow Udayam on Google
Ravi Shukla May 27, 2026 3:56 PM జాతీయంవినోదం
 ‘స్పిరిట్’ షూటింగ్‌లో జోరు పెంచిన ప్రభాస్.. - Udayam
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న తృప్తి డిమ్రి తాజాగా షూటింగ్‌లో చేరారు. అజీజ్ నగర్ పరిసరాల్లో ఆమెకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రబృందం విజయవంతంగా చిత్రీకరించింది. తదుపరి షెడ్యూల్‌ను కోటి ఉమెన్స్ కాలేజీ ప్రాంతంలో నిర్వహించనున్నారు. అక్కడ ప్రభాస్, తృప్తి డిమ్రిలపై ముఖ్యమైన సీన్లు తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...