వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిబండ తండా, గున్యా తండాల్లో ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. నలుగురికి చెందిన స్థావరాల్లో అక్రమ గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
అక్కడ 16 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

