Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపల్లి జలాశయం నుంచి భారీగా నీరు విడుదల

Follow Udayam on Google
Ganga Sep 25, 2026 12:52 PM పార్వతీపురం మన్యంGeneral
తోటపల్లి జలాశయం నుంచి భారీగా నీరు విడుదల - Udayam
తోటపల్లి జలాశయానికి వరద నీరు పోటెత్తింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు ఇన్ ఫ్లో 38,716 క్యూసెక్కులు రావడంతో అప్రమత్తమైన అదికారులు నాగావళి నదిలోకి 45,661 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తోటపల్లి నీటి మట్టం 105మీటర్లు కాగా ప్రస్తుతం 104.04 మీటర్లు ఉందని, ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా శుక్రవారం ఉదయం 5 గంటలకు 1.925 టీఎంసీలు ఉన్నట్లు ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారి కిశోర్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...