వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలంలోని తోరికవలస గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్క గ్రామం జమ్మడుగూడ నుంచి పైపుల ద్వారా సరఫరా అవుతున్న చాలీచాలని నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది.
అవసరమైన స్థాయిలో నీరు అందకపోవడంతో తాగునీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి శాశ్వతంగా తాగునీటి సౌకర్యం కల్పించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

