Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టమాటాలకు లేని రేట్లు -రైతులకు తప్పని పాట్లు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 5:53 PM అన్నమయ్యGeneral
టమాటాలకు లేని రేట్లు -రైతులకు తప్పని పాట్లు - Udayam
మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. శుక్రవారం మార్కెట్‌కు 102 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకొచ్చారు. పది కిలోల మేలు రకం రూ.160, రెండో రకం రూ.140, మూడో రకం రూ.110 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. దిగుబడి తగ్గడంతో పాటు వారం రోజులుగా ధరలు లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

Comments

G
Loading comments...