వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార ప్రాధాన్యతను వివరించారు. పిల్లల ఎత్తు, బరువును క్రమం తప్పకుండా నమోదు చేసి, పోషకాహారం అందించాలని అన్నారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం వంటి పోషక పదార్థాలను ఆహారంలో భాగం చేయాలన్నారు.
తల్లిదండ్రులు అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

