వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్, కామారెడ్డి జిల్లాల మధ్య మంజీరా నదిపై రూ.18 కోట్లతో నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు లేక నిరుపయోగంగా మారింది. దీంతో ప్రజలు 40 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది.
సుమారు రూ.22.5 కోట్ల అంచనాతో ప్రతిపాదించిన రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భూసేకరణ చేపట్టి వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

