వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండాకు చెందిన కోలా విఠల్(43) చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందాడు. సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన విఠల్ మృతదేహం, చెరువు ఒడ్డున ఉన్న దుస్తుల ఆధారంగా లభ్యమైంది.
మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు శివ్వంపేట ఏఎస్సై సాయిలు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

