వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ20 లీగ్‌లో నల్గొండ నైట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. జూన్ 24న జరిగిన పోరులో కరీంనగర్ డైమండ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ 130 పరుగులకు ఆలౌట్ కాగా, వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నల్గొండకు 117 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
లక్ష్య ఛేదనలో నల్గొండ నైట్స్ 17 ఓవర్లలోనే విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. జట్టు బ్యాటర్ల సమష్టి పోరాటంతో ఈ గెలుపు సాధ్యమైంది.
Comments
Loading comments...

