Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి కంపోస్ట్ యార్డును తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 21, 2026 7:36 PM గుంటూరుGeneral
తెనాలి కంపోస్ట్ యార్డును తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల - Udayam
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి మున్సిపల్ కంపోస్ట్ యార్డును స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో కలసి గురువారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న కంపోస్ట్, కోకోపీట్ తయారీ విధానం, నిర్వహణ తీరును ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. నాణ్యమైన కంపోస్ట్ ఉత్పత్తుల తయారీ, వాటి సమర్థ నిర్వహణ మరియు వినియోగంపై అధికారులకు పలు సూచనలతో పాటు తగిన ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...