వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మంత్రివర్గ సమావేశాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2 కోట్ల వ్యయంతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఇకపై క్యాబినెట్ ఫైల్స్, ఎజెండాలు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండనున్నాయి.
ఈ విధానంతో పరిపాలనలో పారదర్శకత, వేగం పెరుగుతాయి. అత్యంత భద్రతతో కూడిన ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా మంత్రులు ఎక్కడి నుండైనా ఫైళ్లను పరిశీలించే సదుపాయం కలుగుతుంది. దీనికి టీడీటీఎస్‌ను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది.
Comments
Loading comments...

