Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తానా స్వర్ణోత్సవ వేళ.. విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 11:35 AM జాతీయంGeneral
తానా స్వర్ణోత్సవ వేళ.. విద్యార్థులకు బ్యాగుల పంపిణీ - Udayam
అమెరికాలో తానా (TANA) 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బెతూన్ ఎలిమెంటరీ స్కూల్‌లో విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేశారు. 'గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ' నినాదంతో తానా నార్త్ సెంట్రల్ టీమ్ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. సుమారు 150 మంది విద్యార్థులకు తానా ప్రతినిధులు బ్యాగులు అందజేశారు. కమ్యూనిటీకి తమ వంతు సేవలు అందించేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...