వార్తలకు తిరిగి వెళ్లండి

అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెంలో గురువారం ఇంటి ఆవరణలో నల్ల తాచుపాము హల్‌చల్ చేసింది. అరుగుపై బుసలు కొడుతున్న పామును గుర్తించిన రవణం అనే వ్యక్తి హరి స్నేక్ క్యాచర్ గణేష్‌వర్మకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి చేరుకున్న గణేష్‌వర్మ పామును చాకచక్యంగా పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. అనంతరం జనసంచారం లేని ప్రాంతంలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

