Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam Digital on Google
Sonal Mehrotra Jun 09, 2026 4:03 PM ఆల్ ఇండియామార్కెట్లు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam Digital
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం, రూపాయి విలువ బలపడటం మరియు బ్యాంకింగ్ సెక్టార్‌లో కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు లాభాల బాట పట్టాయి. చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 394 పాయింట్లు లాభపడి 73,918 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 119 పాయింట్ల లాభంతో 23,242 వద్ద స్థిరపడింది. ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఐ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడగా, ఓఎన్‌జీసీ, టైటాన్ నష్టపోయాయి.

Comments

G
Loading comments...