Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం: ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు!

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 08, 2026 6:31 PM జాతీయంక్రీడలు
సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం: ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు! - Udayam
టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం తన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ శుభసందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 'హాల్ ఆఫ్ ఫేమ్'లో గంగూలీకి చోటు దక్కబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ అరుదైన గౌరవం అందుకున్న 12వ భారత క్రికెటర్‌గా ఆయన నిలుస్తారు. దాదాపు 17 ఏళ్ల పాటు క్రికెటర్‌గా, కెప్టెన్‌గా భారత్‌కు గంగూలీ అద్భుత సేవలు అందించారు. 2003 వరల్డ్ కప్ ఫైనల్ చేరడం, విదేశాల్లో సిరీస్‌లు గెలవడంతో పాటు తన దూకుడుతో టీమిండియా రూపురేఖలను మార్చిన ఘనత ఆయనది.

Comments

G
Loading comments...