Back to feed
సౌరవ్ గంగూలీ బయోపిక్ షూటింగ్
Rohit Gupta May 28, 2026 11:01 AM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత కథతో తెరకెక్కుతున్న ‘దాదా’ చిత్రం షూటింగ్ కోల్‌కతాలో వేగంగా సాగుతోంది. గంగూలీ పాత్రలో నటిస్తున్న రాజ్‌కుమార్ రావు, ఆ లుక్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో సందడి చేశారు. గంగూలీ క్రికెట్ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను ఈ 15 రోజుల షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు.
విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. డోనా గంగూలీ పాత్రలో తాన్యా మణిక్తల నటిస్తోంది. షూటింగ్ సమయంలో గంగూలీ స్వయంగా పాల్గొని చిత్ర బృందానికి సూచనలిస్తున్నారు.
Comments
Loading comments...



