Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూసుమంచిలో రూ.16.13 కోట్ల అభివృద్ధి పనులు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jun 27, 2026 2:39 PM ఖమ్మంGeneral
కూసుమంచిలో రూ.16.13 కోట్ల అభివృద్ధి పనులు - Udayam
పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గ్రామీణ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూ. 16.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దుబ్బతండా, లాల్ సింగ్ తండా మరియు జీళ్ళచెరువు గ్రామాల్లో నూతన బీటీ రోడ్లు, వంతెనల నిర్మాణానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ అభివృద్ధి పనులు గ్రామీణ ప్రజల ప్రయాణ కష్టాలను తీరుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...