Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమసమాజ నిర్మాణానికి బసవేశ్వరుడి కృషి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 23, 2026 11:55 AM వికారాబాద్General
సమసమాజ నిర్మాణానికి బసవేశ్వరుడి కృషి - Udayam
సమ సమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు కృషి చేశారని వికారాబాద్ వీరశైవ సమాజం అధ్యక్షులు కొకుంట్ల వీరేశం పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి బసవరాధన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఆచరణీయమని, ప్రతి ఒక్కరు ఆయన చూపిన బాటలో నడుచుకొని చక్కటి జీవితం సాగించాలన్నారు.

Comments

G
Loading comments...