వార్తలకు తిరిగి వెళ్లండి
కొత్త గూటికి చేరిన శ్రుతి హాసన్

నటి, గాయని శ్రుతి హాసన్ సోమవారం తన సరికొత్త నివాసంలోకి అధికారికంగా గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
ఈ ప్రత్యేక వేడుకకు సంబంధించిన పూజా చిత్రాలు, స్వీట్లు, కొత్త ఇంటి తాళాల ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Loading comments...