Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యాలమ్మ జాతర పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 12:25 PM సూర్యాపేటGeneral
ముత్యాలమ్మ జాతర పనులకు శ్రీకారం - Udayam
హుజూర్‌నగర్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్న ముత్యాలమ్మ జాతర పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. రామాలయం వద్ద బొడ్రాయి దగ్గర కమిటీ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి సల్లకుండ ఎత్తే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి బోనాలు, కానుకలు స్వీకరించనున్నారు. 6న పెద్ద ముత్యాలమ్మ, 7న చిన్న ముత్యాలమ్మ, 10న కనకదుర్గమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...