Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ రామాలయంలో వైభవంగా పునర్వసు హోమ మహోత్సవం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 07, 2026 2:21 PM విశాఖపట్నంGeneral
​శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం పరిధిలో, గంగధార సమీపంలో కొలువై ఉన్న పురాతన ఉప ఆలయం శ్రీ రామాలయంలో, లోకారాధ్యుడు శ్రీరామచంద్రప్రభువు జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని నేడు పునర్వసు హోమ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ​వేదఘోషలు, మంత్రనాదాలు, నాదస్వర వాద్యాల దివ్యనాదాల మధ్య ఈ పవిత్ర హోమం భక్తిశ్రద్ధలతో, కనులపండువగా నిర్వహించబడింది.

Comments

G
Loading comments...