Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తి యాప్‌పై మహిళలకు అవగాహన

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 21, 2026 12:36 PM చిత్తూరుGeneral
శక్తి యాప్‌పై మహిళలకు అవగాహన - Udayam
మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్‌పై జిల్లా వ్యాప్తంగా మహిళా పోలీసులు, శక్తి టీం సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. చిత్తూరు గిరింపేట దుర్గమ్మ గుడి వద్ద ఎస్‌ఐ కరీమున్నీషా ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు యాప్‌ ఉపయోగాలు వివరించి, వారి ఫోన్లలో డౌన్‌లోడ్ చేయించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం త్వరగా పొందేందుకు యాప్‌ ఉపయోగపడుతుందని తెలిపారు. సోషల్ మీడియా లో జాగ్రత్తలు పాటించాలన్నారు.

Comments

G
Loading comments...