Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మసిగుడ్డలా షర్ట్.. ధర చూసి షాక్

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 2:22 PM జాతీయంGeneral
మసిగుడ్డలా షర్ట్.. ధర చూసి షాక్ - Udayam
‘Myntra’లో ఓ డిజైనర్ చెక్స్ షర్ట్ ధర రూ.1.14 లక్షలు ఉండటం నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. డిస్కౌంట్ తర్వాత కూడా రూ.80 వేలు ఉండటంతో షర్ట్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. షర్ట్ మురికిగా, మసిగుడ్డలా కనిపిస్తోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి గుడ్డలు కిచెన్, మెకానిక్ షాపుల్లో ఉచితంగా దొరుకుతాయని, వాటికి ఇంత ధర పెట్టడం విడ్డూరమని కామెంట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...