వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు వెళ్తాను : మాజీ ప్రధాని షేక్ హసీనా
శరణ్య శర్మ Jun 28, 2026 1:39 PM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago

ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కుట్రలను అధిగమించి ఈ ఏడాదే తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. బంగ్లాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన లేవని.. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బలహీనపడిందని ఆమె ఆరోపించారు.
మైనారిటీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, అవామీ లీగ్‌ను బలప్రయోగంతో అణచివేయలేరని హసీనా స్పష్టం చేశారు.
Comments
Loading comments...